తమిళనాడులో ప్రతిఏటా నిర్వహించే జల్లికట్టు ప్రారంభమైంది. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్ ఆలయం ఎదుట అట్టహాసంగా జల్లికట్టును ప్రారంభించారు. దీంతో ఆ ఆటను చూడడానికి స్థానికులతో పాటు చుట్టుపక్కల జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు.
జనాల రద్దీ దృష్ట్యా క్రీడ నిర్వహకులను పకబ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రీడలో బలిష్టమైన, పదునైనా కొమ్ములు కలిగిన 750 ఎద్దులు రంగంలోకి దింపారు. పందెం ఎడ్లను అదుపు చేసేందుకు కండలు తిరిగిన, బలమైన శరీర దారుఢ్యం కలిగిన 300మంది యువకులు పోటీలో పాల్గొనన్నారు.
సాధారణంగా ఈ జల్లికట్టు క్రీడలు పొంగల్ పండగ సందర్భంగా ప్రారంభమవుతాయి. తమిళ సంగమ చరిత్ర కాలంనుంచి జల్లికట్టు క్రీడలు కొనసాగుతుంది. తమిళ చరిత్రకారుల అంచనా ప్రకారం మొదటి జల్లికట్టు తచ్చన్కురిచి జల్లికట్టుగా ప్రసిద్ది చేందింది.
Also Read:హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్!

