యాదాద్రికి జలవిహార్ రామరాజు…కేజీ బంగారం విరాళం

124
Jalavihar
- Advertisement -

యాదాద్రి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం.. ప్రముఖ వ్యాపారవేత్త ఎన్.వి.రామరాజు జలవిహార్ పక్షాన ఒక కిలో బంగారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన చేశారు.

యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో మాకు భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదాలు. మన భారతదేశం ఎంతోమంది గొప్ప చక్రవర్తులకు ప్రసిద్ధి పొందింది. చెట్లు నాటడంలో అశోకుడు, నీటిపారుదల వ్యవస్థ నిర్మాణంలో రాణీ రుద్రమదేవి, దేవాలయాల నిర్మాణానికి రాజరాజ చోళుడు, సంస్కృతీ, సాంప్రదాయాల పరిరక్షణకు శ్రీకృష్ణ దేవరాయలు ఎంతో గొప్ప కృషి చేసి, చరిత్ర గతిలో ప్రసిద్ధి పొందారు.

ఆ గొప్ప చక్రవర్తులు సాధించిన కార్యాలన్నీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. దశాబ్దకాలంలోపే సాకారం చేయగలిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం, హరితహారం, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, మహా చండీయాగం వంటి మహత్కార్యాలను పూర్తి చేశారు. దైవికమైన ఈ ప్రయత్నాలలో సామాన్య ప్రజలను సైతం భాగస్వాములను చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేసీఆర్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఈ శతాబ్దపు సంస్కర్త, మరో భగీరథుడు. యాదాద్రి దేవాలయ విమాన గోపుర నిర్మాణం కోసం.. మా పక్షాన సమర్పిస్తున్న ఒక కిలో బంగారాన్ని స్వీకరించగలరని మనవి అని పేర్కొన్నారు.

- Advertisement -