జలమండలి అధికారులతో ఎండీ దాన కిషోర్ సమీక్ష

499
dana kishore
- Advertisement -

ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ, విడిఎస్-2019, సెవరెజీ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎండీ దాన కిషోర్.

ఈ సందర్భంగా ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ.. 100శాతం బిల్లింగ్, 100 శాతం కలెక్షన్ అయ్యేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజీఎమ్ లు, జీఎమ్ లు, డీజీఎమ్ లు, మేనేజర్లు తమకు నిర్ధేశించిన రెవెన్యూ లక్ష్యాలను పూర్తిచేసి, రెవెన్యూ పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. మెండిబకాయిల వసూలు, బిల్లులు చెల్లించని కనెక్షన్ల తొలగింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. అలాగే అక్రమ నల్లా కనెక్షన్లు క్రమబద్దీకరించడం కోసం డీజీఎమ్ లు తమ పరిధిలో ప్ర్యతేక క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

విడిఎస్-2019 ద్వారా ఇప్పటీ వరకు దాదాపుగా 2300 అక్రమ నల్లా కనెక్షన్ దారుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీరికి త్వరలోనే క్యాన్ నెంబర్లు కేటాయిస్తామని వివరించారు. విడిఎస్-2019 వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు అమలులో ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున జరిమానాలు, క్రిమినల్ కేసుల బారిన పడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఎండీ మరోసారి నగరవాసులను కోరారు.

అలాగే ఇంటింటి సర్వేలో ఇప్పటి వరకుయ ఆరు డివిజన్ల పరిధిలో 73,841 కనెక్షన్లను సర్వే చేయగా ఇందులో 3727 కమర్షియల్ కనెక్షన్లు, 1288 ఎంఎస్ బీ కనెక్షన్లు, 1410 అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఒకేసారి కనెక్షన్ ఛార్జీల రూపంలో దాదాపుగా రూ. 9.3 కోట్లు, నెలనెల నల్లా బిల్లు ద్వారా దాదాపు రూ. 22 లక్షల ఆదాయం సమకూరుతుందని వివరించారు.

పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో సెవరెజీ ఓవర్ ఫ్లోలు, మంచినీటి లీకేజీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎండీ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ఫష్టంచేశారు. అలాగే ఏవైనా మ్యాన్ హోళ్లు ధ్వసమయితే యుద్దప్రతిపాదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు.

మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచనతో నాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్) నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలో 45 మంది సైట్ ఇంజనీర్లను తీసుకున్నట్లు వివరించారు. వీరికి ఆరు రోజుల పాటు ఓ అండ్ ఎమ్, రెవెన్యూ, వాటర్ ట్రీట్ మెంట్, సెవరెజీ ట్రీట్ మెంట్ లపై అవగాహాన కల్పించినట్లు తెలిపారు. వీరిని ఓ అండ్ ఎమ్ డివిజన్లకు కేటాయిస్తామని ఎండీ తెలిపారు.

ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్ లతో పాటు సీజీఎమ్ లు, జీఎమ్ లు, డీజీఎమ్ లు, మేనేజర్లు పాల్గొన్నారు.

- Advertisement -