జలమండలి ‘జల గీతం’..!!

374
hmwssb
- Advertisement -

హైదరాబాద్ మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల మండలి సుమారు ఒక కోటి మందికి పైగా ఉన్న నగర జనాభాకు మంచి నీటి సరఫరా చేస్తోంది. 1642 కిలోమీటర్ల వైశాల్యం తో ఉన్న నగరానికి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉన్న గోదావరి, కృష్ణ నదుల నుంచి పెద్ద పెద్ద పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తూ సుమారు 472 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని అంటే 214 కోట్ల 76 లక్షల లీటర్లను హైదరాబాద్ నగర జనాభాకు జలమండలి సరఫరా చేస్తుంది.

నీటిని పంపింగ్ చెయ్యడానికి ఒక కిలోలీటరుకు 45 రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంటే ఆ నీటిని కేవలం 7 రూపాయలకే బస్తీల్లోని ప్రజలకు, 10 రూపాయలకు ఇతర గృహాలకు ప్రభుత్వం సబ్సిడీ పై సరఫరా చేస్తుంది.472 మిలియన్ గ్యాలన్ల మంచినీటి సరఫరా లో రోజుకు సుమారు ఆరు లక్షల మందికి సరిపోయే 25 మిలియన్ గ్యాలన్ల అంటే 70 కోట్ల లీట్లర్ల మంచి నీటిని నగర ప్రజలు వృధా చేస్తున్నారు.

వాహనాలు కడగడం, పైపులతో వరండాలు కగడం, ఓవర్ హెడ్ ట్యాంకులు నిండిపోయి నీరు వృధాగా పోవడం మొదలైన చేస్తున్నారు. వృధా నీరు రోడ్ల మీద పోతుంటే రోడ్లు పాడవడం కాకుండా నీరు కూడా కలుషితం అవుతుంది.నగర ప్రజల్లో నీటి పొదుపు పట్ల, నీటిని వృధాని అరికట్టడానికి అవగాహన కోసం జలమండలి(హైదరాబాద్ మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల మండలి) ‘జల గీతం’ ద్వారా చేస్తున్న చిన్ని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరుకూడా పాలుపంచుకుని నీటి వృధాని అరికట్టి భవిష్యత్ తరానికి నీటిని అందించే విధంగా ఈ పాటను మీ ఛానల్లో ప్రసారం చేయగలరని మనవి చేయడమైనది.

- Advertisement -