కారెక్కిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత..

362
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బపడుతోంది. పార్టీ నుండి వలసలు వెళ్తుండటంతో శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత పార్టీని వీడారు. ఆయన ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు. ఈరోజు ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్ జలగం ప్రసాదరావుకు టీఆర్ఎస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Jalagam Prasad Rao

టీఆర్ఎస్‌ భవన్‌లో జలగం ప్రసాదరావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని అన్నారు. డిసెంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో పొరపాటున మహాకూటమి అధికారంలోకొస్తే, మనకు నీళ్లు రావని, నాగార్జున సాగర్ గేట్లను చంద్రబాబు మూసేస్తాడని, తెలంగాణలో చంద్రబాబు చెబితే సీట్లిచ్చే దుస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించించగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు తెరాస నేతలు హాజరయ్యారు.

- Advertisement -