మిషన్ భగీరథ లాంటి తాగునీటి ప్రాజెక్టు దేశంలో ఇంకెక్కడా లేదన్నరు జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్ కుమార్. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని భగీరథ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న అజయ్ కుమార్, ప్రతీ ఇంటికి నల్లాతో నీటిని సరాఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నరు. పెద్ద రాష్ట్రం ఐన తెలంగాణ, తక్కువ కాలంలోనే వంద శాతం ఆవాసాలకు శుద్దిచేసిన నీటిని సరాఫరా చేయడం అద్భుతం అన్నారు.
భగీరథ ప్రాజెక్టును పరిశీలించడానికి అజయ్ కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చింది. ఇవాళ భగీరథ కేంద్ర కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయింది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ డిజైన్, లక్ష్యంపై భగీరథ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంటెక్ వెల్, నీటి శుద్ది కేంద్రాలు, ఆవాసాల్లో తాగునీటి సరాఫరా వ్యవస్థ ఫోటోలను ప్రదర్శించారు. భగీరథ పనులు, అనుమతలు తీసుకున్న తీరును జల్ జీవన్ మిషన్ బృందానికి ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించామన్నరు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు శుద్దిచేసిన నీరు అందుతోందన్నారు. ఆ తరువాత మాట్లాడిన అజయ్ కుమార్, తాగునీటి రంగంలో దేశానికే మిషన్ భగీరథ దిక్సూచీ అన్నరు. చాలా రాష్ట్రాలు మిషన్ భగీరథ మోడల్ ను ఫాలో అవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్ , చీఫ్ ఇంజనీర్లు విజయ్ ప్రకాశ్, వినోభాదేవి, చెన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జ్ఞానకుమార్, శ్రీనివాస్ రావు తో పాటు కన్సల్టెంట్లు నర్సింగరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.