మోడీపై జైరాం రమేష్ ఘాటు వ్యాఖ్యలు..

11
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. మోడీ ప్ర‌చార కార్య‌క్ర‌మం ఆసాంతం హిందూ-ముస్లిం చుట్టే తిరిగింద‌ని వెల్లడించారు. జార్ఖండ్‌లో జైరాం ర‌మేష్ బుధ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడిన రమేష్..అస‌త్య‌మేవ జ‌య‌తే అనే మూల సిద్ధాంతంతో ప‌నిచేసే తొలి ప్ర‌ధాని మోదీయేన‌ని దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌ధాని కేవ‌లం హిందూ, ముస్లిం రాజ‌కీయాలు చేయ‌ద‌ల‌చుకుంటే ఆయ‌న ప్ర‌జా జీవితంలో కొన‌సాగేందుకు ప‌నికిరార‌ని చెప్పారు. మ‌న జాతీయ చిహ్నం కింద స‌త్య‌మేవ జ‌యతే అని రాసి ఉండ‌గా ప్ర‌ధాని మాత్రం పొర‌పాటున కూడా నిజాలు మాట్లాడ‌ర‌ని అన్నారు. అస‌త్యాల‌తో పాల‌న సాగించే మోదీ ఓ బ్ల‌ఫ్‌మాస్ట‌ర్ అని జైరాం ర‌మేష్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

Also Read:ఆకలి వేయట్లేదా.. ఇలా చేయండి!

- Advertisement -