- Advertisement -
ధన్ ఖడ్ రాజీనామాకు ఆరోగ్య కారణాలు చెప్పినప్పటికీ.. ఆయన తీసుకున్న నిర్ణయానికి లోతైన కారణాలున్నాయి అని ఎక్స్ వేదికగా తెలిపారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఏం జరిగింది?. అకారణంగానే రాజ్యసభ బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు గైర్హాజరయ్యారు అన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ అధ్యక్షతన బీఏసీ మీటింగ్ కు నడ్డా, కిరణ్ రిజిజు హాజరుకాలేదు… వాళ్లిద్దరు బీఏసీకి రాకపోవడంపై ధన్‌ఖడ్ కు సమాచారం ఇవ్వలేదు అన్నారు. జేపీ నడ్డా, కిరణ్ రిజిజు గైర్హాజరుపై ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు అని తెలిపారు. రాజ్యసభ నిబంధనల విషయంలో ధన్‌ఖడ్ కఠినంగా వ్యవహరించారు అని వెల్లడించారు జైరాం రమేష్.
Also Read:టీటీడీ పాలకమండలి సమావేశం
- Advertisement -

