ప్రజానేత జైపాల్‌ రెడ్డికి హరీష్ నివాళి..

395
harishrao jaipal reddy
- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కి నివాళులు అర్పించారు మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు . జూబ్లిహిల్స్ లోని జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన హరీష్ ..జైపాల్ రెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. హరీశ్ రావుతో పాటు ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,ఎంపి ప్రభాకర్‌ రెడ్డి ,ఎమ్మెల్యే సోలిపేట రామలింగ రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్…..జైపాల్ రెడ్డి మరణం దిగ్భ్రాంతి ని కలిగించిందన్నారు. .జైపాల్ రెడ్డి మృతి తో తెలంగాణ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. జైపాల్ రెడ్డి విలువలతో కూడిన గొప్ప ప్రజాస్వామ్యవాది ..ఉత్తమ పార్లమెంటేరియన్ గా జైపాల్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.

మరోవైపు జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రజలు,కార్యకర్తల సందర్శనార్ధం గాంధీ భవన్‌లో గంటపాటు ఉంచనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్ వద్ద జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, బూర నర్సయ్య నివాళులర్పించారు.

- Advertisement -