సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం… పివి ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు

310
Jaipal Reddy DeadBody
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు పలువురు సంతాపం ప్రకటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైపార్ రెడ్డి మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఆయన చాలా సేవలు చేశారన్నారు.

జుబ్లిహిల్స్ ఆయన నివాసంలో పలువురు వచ్చి ఆయన పార్ధివదేహానికి నివాళులర్పిస్తున్నారు. మధ్యాహ్నం ఆయన పార్ధివదేహాన్ని గాంధీ భవన్ కు తీసుకెళ్లి అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు జరుపనున్నారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియల పట్ల తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి స్మారకానికి స్థలాన్ని కేటాయిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ వెల్లడించారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని, ఆపై ఆ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మారుస్తామని అన్నారు.జైపాల్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు.

- Advertisement -