HarishRao:ఖైదీల్లోసత్ప్రవర్తన కోసమే ఈ నిర్మాణం

46
- Advertisement -

ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావాడానికి జైళ్ల శాఖ నిరంతరం కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఎన్సాన్‌పల్లి గ్రామంలో జిల్లా కారాగార భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే కొత్త జిల్లాలో ఏర్పాటు చేయనున్న మొదటి కారాగారం ఇదే అని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ప్రిజనర్స్‌ డీజీ జితేందర్, ప్రిజనర్స్‌ ఐజీ రాజేశ్‌, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రోజా శర్మ, ప్రిజనర్స్‌ డీఐజీ మురళీ బాబు, కమిషనర్‌ శ్వేతా, చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రూ.78కోట్లతో 34ఎకరాల సువిశాల స్థలంలో జిల్లా జైళ్లు నిర్మాణం చేపట్టామన్నారు. జైళ్లలో సౌకర్యాలు కల్పించి, అవసరమైన ఉపాధి, శిక్షణ, కౌన్సిలింగ్ అక్షరాస్యత నేర్పి ఖైదీల్లో సత్ర్పవర్తన తీసుకురావచ్చన్నారు. ఏడు ఎనిమిది సంవత్సరాల కృషి ఫలితంగా సిద్దిపేటకు జిల్లా జైళ్లు వచ్చిందన్నారు.

ఇందులో సూమారుగా 425మంది ఖైదీళ్లు ఉండవచ్చన్నారు. ఇందులో ఓపెన్ జైళ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ధ్యానం, యోగా, నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఉన్న సబ్‌జైళ్లును సిద్దిపేట మున్సిపాలిటీ రెవెన్యూ కార్యాలయానికి వాడుకుంటామన్నారు. మెడికల్ కళాశాల, ఆసుపత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, సెంట్రల్ బట్టర్‌ఫ్లై లైటింగ్‌, సమీపంలోనే కోమటి చెరువు, శిల్పారామం అన్నీ ఉన్నాయన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మాదిరిగా ఎన్సాన్‌పల్లి కూడా దినదినాభివృద్ధి చెందుతుందన్నారు.

Also Read: BRSUSA:తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం

జైళ్లశాఖ డీజీ జితేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన నాటినుండి ఇప్పటివరకు 400 మంది సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేశామన్నారు. జైల్లో క్రమశిక్షణ నేర్పడం, వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో జైళ్లకు రిపీటెడ్‌గా వచ్చే ఖైదీల శాతం 8 నుంచి 2శాతానికి తగ్గిందన్నారు.

Also Read: Telangana:దశాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

- Advertisement -