Jailer 2: ఫోర్త్ సింగిల్

2
- Advertisement -

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ సీక్వెల్ చిత్రం అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల విషయంలో స్పీడు పెంచుతూ, సినిమాలోని నాల్గవ పాట (4th Single) విడుదల తేదీని ప్రకటించింది.

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచి, తన గ్లామర్‌తో అలరించబోతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ ట్రాక్, మైండ్ బ్లాకింగ్ బీట్స్‌తో హై-ఎనర్జీ డాన్స్ నంబర్‌గా ఉండబోతోందని సమాచారం.

ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ పాట శీర్షికను (Song Title) మేకర్స్ సస్పెన్స్‌గా ఉంచారు. పాటతో పాటు శీర్షికను మరియు ఇందులో మెరిసే ఇతర నటీనటుల వివరాలను ఈ సాయంత్రమే నేరుగా వెల్లడించనున్నారు. ఇది అభిమానుల్లో మరియు సంగీత ప్రియులలో మరింత ఉత్సుకతను పెంచుతోంది.

Also Read:సాగరహారానికి 14 ఏళ్లు!

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే బిజినెస్ పరంగా కూడా ‘జైలర్ 2’ దుమ్మురేపుతోంది.

ఈ చిత్రంలో విద్యా బాలన్, సూరజ్ వెంజారమూడు, రమ్యకృష్ణ, ఎస్. జె. సూర్య, మిథున్ చక్రవర్తి, మిర్నా మీనన్ మరియు యోగి బాబు వంటి దిగ్గజ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై రజనీ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

- Advertisement -