లాలూ కూలీ ..రోజుకు రూ. 93..

271
- Advertisement -

కుంభకోణాలతో కోట్లు గడించిన ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు.. ఇప్పుడు రోజు కూలీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశుదాణా కుంభకోణంలో దోషిగా నిరూపితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలులో పని అప్పగించారు అధికారులు.

లాలూకు.. జైల్లో ఇప్పుడు రూ.93 రోజుకూలీ చెల్లిస్తున్నారు. రాంచీలోని బిర్సా ముండా జైల్లో ఉన్న లాలూ.. తోటమాలి పని చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయనకు ఇచ్చే వేతనమిది. మరోవైపు ఈ కేసులో తాను దోషిగా తేలడం, శిక్షపై లాలూ ఓపెన్ లెటర్ రాసి ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.

 Jailed For 3.5 Years, Lalu Prasad To Work As Gardener Earning Rs 93 ..

దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం తాను పోరాడతానని, తనను దో షిగా తేల్చి, జైలుకు పరిమితం చేయాలని చూసినా తన పోరాటంలో వెనకడుగు వేయబోనని తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తోందని ఆరోపించారు.

తమ మాట వినకుంటే ఎవరినైనా వేధించడం బీజేపీ నైజమని నిప్పులు చెరిగారు. కాగా..దాణా కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి లాలూకు మూడున్నరేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

- Advertisement -