వీరి మధ్య కొత్త వివాదం తప్పదా..?

256
Here's what Karan Johar really thinks about Kangana's Koffee With..
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె స్వభావంతో బీ టౌన్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అదే క్రమంలో వివాదాలతో కూడా సావాసం చేసే నటిగా కంగనా రనౌత్ చేంజ్‌ అయిపోయింది. అయితే తాజాగా కంగ‌నా ర‌నౌత్‌, క‌ర‌ణ్ జోహార్.. విరుష్క ముంబై రిసెప్ష‌న్‌లో క‌లిసిన‌పుడు ఒక‌రినొక‌రు చూసి చిరున‌వ్వులు చిందించుకున్నారు.

Here's what Karan Johar really thinks about Kangana's Koffee With..

ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ స‌హ‌జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న “ఇండియాస్ నెక్స్ట్ సూప‌ర్‌స్టార్స్” కార్య‌క్ర‌మానికి కంగనాను పిలుస్తారా? అనే ప్రశ్నకు ఇటీవల కరణ్ సానుకూలంగా స్పందించారు. గ‌తంలో ‘కాఫీ విత్ క‌ర‌ణ్‌’ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్‌లో స్వాభిమానాన్ని పెంచిపోషించే వ్య‌క్తిగా క‌ర‌ణ్‌ని అభివ‌ర్ణిస్తూ కంగనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఆ త‌ర్వాత నుంచి వీలు చిక్కినప్పుడ‌ల్లా వివిధ కార్య‌క్ర‌మాల్లో కంగ‌నాను క‌ర‌ణ్ త‌న‌దైన రీతిలో కామెంట్లు చేసేవాడు. ఇలా వారిద్ద‌రి మ‌ధ్య వివాదం న‌డిచింది. ఈ నేపథ్యంలో కరణ్‌‌తో కంగనా మీటింగ్ ఎలాంటి వివాదాలకు దారితీస్తుందోనని బిటౌన్ జనం జడుసుకుంటున్నారనే చెప్పాలి.

- Advertisement -