జై లవకుశ … రెండో టీజర్ వచ్చేస్తోంది…!

187
Jai Lavakusha Second Teaser soon..!
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వకుశ‌.  ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఎన్టీఆర్‌ సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్ తో క‌నిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు.

ఇక ఈ నెలాఖరున రెండవ టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే డేట్ చెప్పనున్నారట. ఈ సారి ‘లవ’ పాత్రకి  సంబంధించిన టీజర్ ను వదులుతారని తెలుస్తోంది. ఈ పాత్రలో ఎన్టీఆర్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. మొదటి టీజర్ కి మించి రెండవ టీజర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. రాశిఖన్నా .. నివేదా థామస్ .. నందితా రాజ్ కథానాయికలుగా నటిస్తోన్నారు.

జై పాత్ర టీజర్‌తో రాముడు లాంటి జూ ఎన్టీఆర్ రావణుడిగా మారితే తన విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన ఈ టీజర్‌కు ఎవరూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది. టీజ‌ర్ రిలీజై గా 24 గంటలు కూడా గడవకముందే సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ టీజర్ ఇప్పటి దాకా 7 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది. పరిశ్రమలో టీజర్ వ్యూస్ పరంగా ఇదొక కొత్త రికార్డ్. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -