నాలో ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయ్..అంటూ ‘టెంపర్’ లో దుమ్ములేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఇప్పుడు ‘జై లవ కుశ’లో మరిన్ని యాంగిల్స్‌ని చూపించడానికి రెడీ అయిపోతున్నాడు. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఎట్టిపరిస్థితుల్లోనూ దసరా సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర టీమ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపేసింది. ఈ సినిమాలోని జై, లవ, పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసిన చిత్ర టీమ్ త్వరలో కుశాల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చెయ్యనుంది.
ఇక ఇదిలా ఉంటే..ఇప్పటికే వాయిదా పడ్డ జెఎల్‌కె (జై లవకుశ) ఆడియో రిలీజ్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆడియో వేడుకను సెప్టెంబర్ మొదటి వారంలో జరిపే ప్లాన్‌లో ఉంది చిత్ర యూనిట్.