‘యంగ్‌టైగర్’ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘జైలవకుశ’. బాబి దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘జై’, ‘లవ’, ‘కుశ’అనే మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. జై,లవ,కు సంబంధించిన పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేశారు. తాజాగా లవ,కుశ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈసినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎన్డీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెపుడా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఆడియో వేడుకను కూడా చిత్ర యూనిట్ త్వరలోనే నిర్వహించేందుకు ప్లాన్ చేసిందట. తాజా సమాచారం ప్రకారం జై లవకుశ ఆడియో రిలీజ్ డేట్‌ను మళ్ళీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్ 3న జరగాల్సిన ఆడియో రిలీజ్ ఫంక్షన్.. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యింది.
సెప్టెంబర్ 3న ‘జై లవ కుశ’ ఆడియో రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ రోజున హైదరాబాద్ గణేష్ నిమర్జనం ఉండటం వలన.. సెక్యురిటి ప్రాబ్లమ్ వస్తుందని తెలుసుకుని.. ఆడియో లాంచ్ క్యాన్సిల్ చేశారట. దీని గురించి ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు చెబుతూ.. ”సెప్టెంబర్ 3న దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన జై లవ కుశ ఆడియోను డైరక్టుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తాం. గణేష్ నిమర్జనం కారణంగా ఆ రోజు ఫంక్షన్ ను క్యాన్సిల్ చేసి.. సెప్టెంబర్ 10న గ్రాండ్ గా ప్రి-రిలీజ్ ఈవెంట్ చేస్తాం. అయితే ట్రైలర్ ను కూడా అదే రోజున విడుదల చేస్తాం” అంటూ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తానికి సెప్టెంబర్ మొదటివారంలో కావాలంటే ఆడియో వినొచ్చు కాని.. ట్రైలర్ చూడాలంటే మాత్రం సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే.