అర్జున్ రెడ్డి…కాపీనా..!

203
Arjun Reddy copie from Ika Selav..!
- Advertisement -

వివాదాలతోనే భారీ హైప్ తెచ్చుకున్న అర్జున్ రెడ్డి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. రిలీజ్‌కు ముందు విజయ్ దేవరకొండ, వీహెచ్‌ మధ్య వార్ జరగగా సీన్‌లోకి ఎంటరైన వర్మ మరింత రక్తికట్టించాడు. దీంతో అర్జున్ రెడ్డి లిప్ కాల్ వివాదం వీహెచ్ వర్సెస్ వర్మగా మారిపోయింది.

తాజాగా అర్జున్ రెడ్డి సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తనదంటూ ఖమ్మంకు చెందిన డి నాగరాజు అనే దర్శకుడు వాదిస్తున్నాడు. ఈ మేరకు అర్జున్ రెడ్డి సినిమా దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపాడు.

గతంలో తాను తీసిన ‘ఇక సె..లవ్’ సినిమా కథనే యథాతథంగా ‘అర్జున్ రెడ్డి’గా రూపొందించారని ఆరోపిస్తున్నాడు. తన అనుమతి లేకుండా, తన కథతో తీసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు.. దీనికి నష్టపరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

కావాల్సినంత ప్రీ పబ్లిసిటీతో విడుదలైన ఈ సినిమా అంతే అంచనాలను నిలబెట్టుకుంది. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమా చూసిన ప్రేక్షకుడికి మాత్రం ఇందులో బోల్డ్ కంటెంట్ కంటే లవ్ అండ్ ఎఫెక్షన్స్‌కి సంబంధించిన రియల్ కంటెంట్ ఉండంటంతో సినిమా బాక్సీఫీసు వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది. ఇప్పటివరకు 47 కోట్లు వసూళ్లు రాబట్టింది.

- Advertisement -