హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తుది దశకు చేరుకోగా హనుమాన్ మూవీకి మించి వందరెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు.
ఈ సినిమాలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతుండగా ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయబోతుందట.
పురాణాల్లో హనుమంతుడు, అశ్వద్ధామ, బలి, కృపుడు, పరశురాముడు ఇలా ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వాళ్లందరినీ ఈ సినిమాలో చూపించబోతున్నాడట ప్రశాంత్ వర్మ. ఇదే నిజమైతే ఈ మూవీ బిగ్గెస్ట్ మల్టీస్టార్ మూవీగా నిలవడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే మాత్రం సినిమా లవర్స్‌కి పండగే.
Also Read:HCU భూములను కాపాడాలి..అందరి బాధ్యత