అఖండ…చలనచిత్ర విజయం:బాలయ్య

118
akhanda
- Advertisement -

బాలకృష్ణ- బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వచ్చిన చిత్రం అఖండ. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారని అఖండతో మరోసారి నిరూపితమైందన్నారు.

అభిమానులతో కలిసి తాను సినిమా చూశానని అయితే కొంతమంది పిల్లలు వచ్చి అంకుల్ సినిమా అద్భుతంగా ఉందని చెప్పారని అయితే తనను ఇలా అంకుల్ అనడం ఏమీ బాగోలేదని, తనకది నచ్చలేదంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.

అఖండ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో కష్టపడ్డారని, ఈ సినిమాలో ఎన్నో నిజాల్ని చూపించామని బాలకృష్ణ అన్నారు. ఇది కేవలం తమ చిత్ర విజయం కాదని, చలన చిత్ర పరిశ్రమ విజయమని చెప్పారు. షూటింగ్ సమయంలో ఆర్టిస్టులంతా ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొని దృఢ సంకల్పంతో పని చేశారని అన్నారు.

- Advertisement -