కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు జగ్గారెడ్డి. సినిమా కథ ను డైరెక్టర్ రామానుజం ప్రిపెర్ చేస్తున్నారు…. డైరెక్టర్ స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో నిమగ్నం అయ్యిండు…. ఈ సినిమా లో ప్రేమ కథ కు నా జీవితం లో జరిగిన మూడు సన్నివేశాలను యాడ్ చేస్తున్నాం అన్నారు.
ఈ సినిమా లో నా ప్రేమ కథ ఉండదు. ఆ ప్రేమికుల కు అండగా నిలిచే పాత్ర లో నేను ఉంటాను అన్నారు. ఈ సినిమా కోసం నన్ను దర్శకుడు ఎంపిక చేసుకున్నాడు.. జగ్గారెడ్డి గా నా జీవితం లో జరిగిన మూడు సంఘటనలు ఉంటాయి….. స్టూడెంట్ లీడర్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా,మున్సిపల్ చైర్మన్ సమయం లో ముఖ్య ఘట్టాలు ఉంటాయి అన్నారు.
ఆరోజులలో స్టూడెంట్ లీడర్ గా కౌన్సిలర్ గా , చైర్మెన్ గా ఉన్న సమయం లో నా ఎలాంటి ఆర్థిక బలం లేదు, ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నాకు ఉన్నది కార్యకర్తల , ప్రజల బలం. నాకు ఎలాంటి ధనబలం లేదు.. కానీ కావాల్సినంత జన బలం ఉంది అన్నారు. నా జీవితం లో ఈ మూడు సందర్బాల్లో పోలీసులు నాపై చేసిన ఒత్తిడులు, నిర్బంధాలు , జిల్లా ఎస్పి తో గొడవ లు ప్రధానంగా ఉంటాయి అన్నారు.
ఒక జిల్లా కలెక్టర్ విషయంలో కూడా నాకు గొడవ జరి గింది. కలెక్టర్ కు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకో లు చేశాను. కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు పోరాటం చేసిన. ఈ సంఘటనలు సినిమాలో ఉంటాయి అన్నారు. కౌన్సిలర్, స్టూడెంట్ లీడర్, చైర్మెన్ గా ఉన్న సంఘటనలు అప్పటి నా పాత్రలో వేరే నటుడు ఉంటాడు… మూడు పాత్రలు తర్వాత నేను సినిమా లో ఎంటర్ అవుతాను అన్నారు.
Also Read:ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు
ఈ మూడు ఘట్టాల్లో ఒక రాజకీయ పార్టీ కి చెందిన నాయకుడు నన్ను మర్డర్ చేసే ప్లాన్ చేశాడు. ఆ మర్డర్ కు బలి కాకుండా నేను ప్రతి వ్యూహం ఎలా చేశానో సినిమా లో చూపించ బొతున్నా….. పోలీసుల నిర్బంధాలు, ఒత్తిళ్ల ను ధీటుగా ఎదుర్కుంటూ నిజ జీవితం లో ఎదిగిన తీరు ను ఈ మూడు పాత్రల ద్వారా ఈ సినిమాలో చూపించ బోతున్నాను అన్నారు.