రాహుల్ గాంధీ శ్రీరాముడి వారసుడని కొనియాడారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.రాహుల్ గాంధీ ప్రజలకోసం పోరాడే ఫైటర్… మోడీ పవర్ కోసం వచ్చిన లీడర్ అన్నారు. మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి..సీఎంలను డిసైడ్ చేసే రాహుల్కు…సీల్డ్ కవర్ సీఎం మోడీకి చాలా తేడా ఉందన్నారు. ప్రధాని కాకముందు మోడీ ఏం పోరాటాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అద్వానీ రథయాత్రకు ముందు దేశానికి.. గుజరాత్ కు మోడీ ఎవరో కూడా తెలియదు. అద్వానీ రథయాత్ర పూర్తి అయ్యాక.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోడీ గెలిచిన తర్వాత అద్వానీ సిల్డ్ కవర్లో సీఎంగా మోడీని ప్రకటించారని గుర్తు చేశారు.
ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ…పేదలకోసం రాముడు పాలన చేశారు. గుడి నిర్మాణం చేస్తే సంతోషిస్తా అని రాముడు అనలేదు అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు రాజకీయంగా బతకాలంటే జై శ్రీరామ్ అనక తప్పదన్నారు. రాముడి ఆదర్శరాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే అని తేల్చిచెప్పారు.
Also Read:రాజస్థాన్లో కాంగ్రెస్ పని ఖతం..