వై య‌స్ రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు

350
Jagapathi babu Ysr Movie
- Advertisement -

తెలుగు వాళ్ల గుండెల్లో ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి గా చ‌రిత్ర సృష్టించిన‌ డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు చేసిన పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న‌చిత్రం యాత్ర‌. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మెష‌న్ మెటెరియ‌ల్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డాక్ట‌ర్ వై య‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి వైయ‌స్ రాజారెడ్డి గారి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు న‌టించారు. ఈరోజు వైయ‌స్ రాజారెడ్డి గారి లుక్ విడ‌ద‌ల చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ…మ‌హ‌నాయకుడు శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి చేసిన‌ పాద‌యాత్ర నేప‌ద్యాన్ని తెర‌కెక్కిస్తున్న చిత్రం యాత్ర‌. ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని పేద ప్ర‌జ‌ల‌, రైతుల భాద‌లు నేరుగా విన‌టానికి కొన‌సాగించిన స‌మ‌ర‌శంఖం ఈ యాత్ర‌. చాలా మటికి రియ‌లిస్టిక్ గా చూపించ‌టానికి మా ద‌ర్శ‌కుడు మ‌హి ప్ర‌య‌త్నించారు. వైయ‌స్ ఆర్ పాత్ర‌లో మమ్ము‌ట్టి గారు అద్బుతంగా న‌టించారు. మ‌మ్ముట్టి గారు డెడికేష‌న్ తో చేశారు. ఆయ‌నే తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌టం విశేషం. మా బ్యాన‌ర్ లో భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర చిత్రం హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి తండ్రి గారు వైయ‌స్ రాజారెడ్డి గారి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు గారు న‌టించారు. పాత్ర చిన్న‌దైనా చాలా ముఖ్య పాత్ర కావ‌టం తో మేము అడిగిన వెంట‌నే అంగీక‌రించిన జ‌గ‌ప‌తిబాబు గారికి మా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 8న తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో విడుద‌ల చేస్తాము.. అని అన్నారు

నటీ నటులు
మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి…..తదితరులు
సాంకేతిక వర్గం:సినిమాటోగ్రాఫర్ – సత్యన్ సూర్యన్,మ్యూజిక్ – కె ( క్రిష్ణ కుమార్ ),ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్,సాహిత్యం – సిరివెన్నెల సీతారామ శాస్త్రి,ప్రొడక్షన్ డిజైన్ – రామకృష్ణ, మోనిక సబ్బాని,సౌండ్ డిజైన్ – సింక్ సౌండ్,వి ఎఫ్ ఎక్స్ – Knack Studios,పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను,సమర్పణ – శివ మేక,బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్,నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – మహి వి రాఘవ్

- Advertisement -