నాని మూవీలో జగ్గుభాయ్!

439
jagapathbabu nani new
- Advertisement -

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి సినిమా చేస్తున్నాడు. మూవీలో సుధీర్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈమూవీలో అదితి రావు హైదరి, నివేదా ధామస్ లు హిరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమూవీ మేలో విడుదల కానుంది. నానికి ఇది 25వ సినిమా. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాని తర్వాత మూవీ నిన్నుకోరి సినిమ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు.

ఈసినిమాకు టక్ జగదీష్ అనే టైటిల్ ను కూడా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈమూవీలో సీనియర్ నటుడు జగపతిబాబు నటిస్తున్నారట. నానికి అన్నయ్య పాత్రలో జగపతిబాబును తీసుకున్న తెలుస్తుంది. నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన నిన్నకోరి మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంలో ఈమూవీపై భారీగా అంచానాలు నెలకొన్నాయి.

- Advertisement -