నా బెస్ట్ లుక్‌ ఇదే: జగ్గూభాయ్

220
jagapathi
- Advertisement -

రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా తాజాగా సినిమా నుండి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా జగపతిబాబు లుక్‌ని రివీల్ చేసింది చిత్రయూనిట్. జగపతి బాబును రాజమన్నార్ గా చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగ్గూ భాయ్ రస్టిక్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఈ లుక్‌పై స్పందించారు జగపతిబాబు. నాతో నేను ప్రేమలో పడిపోయా అని తెలిపారు జగ్గూభాయ్. నా వరస్ట్‌ లుక్స్‌ (విలన్‌ క్యారెక్టర్‌ లుక్స్‌ని ఉద్దేశించి)లో ఇది బెస్ట్‌. ప్రశాంత్‌ నీల్‌ సహాయంతో నటుడిగా నా బెస్ట్‌ ఇస్తాను అని వెల్లడించారు.

హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించగా కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. 14 ఏప్రిల్ 2022 న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -