ఏపీ స్పీకర్‌కు జగన్ లేఖ

22
- Advertisement -

ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖరాశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ రూల్స్ లో నిర్వచించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 10శాతం సీట్లు వుండాలని ఎక్కడా లేదని తెలిపారు. మంత్రులు తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ తీరు చూస్తుంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతుందన్నారు. కూటమి సభ్యులు, స్పీకర్ నాపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని…. చచ్చేదాకా కొట్టాలి అంటూ స్పీకర్ వ్యాఖ్యలు బయటపడ్డాయి. అసెంబ్లీలో గొంతువిప్పే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించగలం అని చెప్పుకొచ్చారు.

Also Read:Bhatti:డ్రగ్స్‌తో జీవితాలు నాశనం

- Advertisement -