జగన్ వర్సెస్ రామానాయుడు

5
- Advertisement -

మాజీ సీఎం వైఎస్ జగన్, మంత్రి నిమ్మల రామానాయుడు మధ్య డైలాగ్ వార్ నెలకొంది. వైసీపీ నేతల భేటీలో మాట్లాడిన జగన్‌.. మీరు ఏ బుక్కులో పేరు రాసుకుంటారో రాసుకోండి.. అన్యాయం చేసినవాళ్లకు సినిమా చూపిస్తానని చెప్పారు. అంతేగాదు దేశం విడిచిపెట్టి పోయినా లాక్కొని వస్తానంటూ సంచలన వ్యాఖ్యలు
చేశారు.

దీనిపై ఘాటుగా స్పందించారు టీడీపీ మంత్రి రామానాయుడు. రాజకీయాల ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్ అని వ్యాఖ్యానించారు నిమ్మల రామానాయుడు.

జగన్ రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏపీ రాష్ట్రం మ్యాప్‌లోనే లేకుండా పోయేదంటూ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:కాళేశ్వరం నోటీసులపై ఈటల

- Advertisement -