వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి గెలిచి రెండోసారి అధికారంలోకి రావడంతో పాటు 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన పార్టీగా చరిత్ర క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. లక్ష్యం పెద్దది కావడంతో అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన కూడా చేస్తున్నారు. 175 స్థానాల్లో విజయం సాధించడం అంతా తేలికైన విషయం కాదు. ప్రత్యర్థి పార్టీలు బలమైనవే అయినప్పటికి వైనాట్ 175 అని జగన్ పదే పదే చెబుతున్నారంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల పెద్ద ఎత్తున ఇంచార్జ్ ల మార్పు చేయడాన్ని బట్టి చూస్తే ఆయన ప్రణాళికలు కూడా స్పష్టంగా అర్థమౌతున్నాయి. ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు. అదే సమయంలో అసంతృప్త వాదులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. .
ఓవరాల్ గా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచేలా వ్యూహరచన చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో వైసీపీకి ప్రతికూల పవనాలు వీచే ఛాన్స్ ఉందని ఆ పార్టీ అంతర్గత సర్వేలు వెల్లడించినట్లు వినికిడి. పైగా టీడీపీ, జనసేన పార్టీలకు ఉత్తరాంధ్రలో బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మెజారిటీ సీట్లను వైసీపీ కైవసం చేసుకున్నప్పటికి ప్రస్తుతం ఆ పార్టీ కంటే టీడీపీ జనసేన పార్టీలదే హవా కనిపిస్తున్నట్లు టాక్. అందుకే జగన్ ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉత్తరాంధ్ర ప్రజలకు దగ్గరయ్యేందుకు విశాఖ రాజధాని చేస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రయత్నలేవీ ముందడుగు పడలేదు. పైగా విశాఖలో జగన్ సర్కార్ భారీగా అవినీతి కుంభకోనానికి పాల్పడిందనే ఆరోపణలు కూడా వైసీపీకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అందుకే ఈ ప్రతికూలతను అధిగమించేలా ఉత్తరాంధ్ర లక్ష్యంగా జగన్ ప్లాన్ చేస్తున్నారట. పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ లోకల్ అభ్యర్థులనే ఎన్నికల బరిలో నిలిపి సత్తా చాటాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎంతమేర సక్సెస్ అవుతాయో చూడాలి.
Also Read:Sree Leela:ఆ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చింది