Pawan:టార్గెట్ పిఠాపురం..జగన్ మాస్టర్ ప్లాన్!

37
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత నుంచి వైసీపీ క్యాడర్ అలెర్ట్ అయింది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పెండెం దొరబాబు గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం వైసీపీ తరుపున వంగా గీత పోటీలో ఉన్నారు. పవన్ పిఠాపురం సీటు ప్రకటించక మునుపే వంగ గీత నియోజకవర్గ ఇంచార్జ్ గా కొనసాగుతూ రావడంతో పవన్ సీటు ప్రకటించిన తర్వాత కూడా ఆమె వైపే మొగ్గు చూపారు అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఆమె పవన్ ను ఢీ కొట్టి నిలిచి గెలిచేనా ? అనే సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. 90 వేలకు పైగా కాపు ఓటర్లు ఉన్న పిఠాపురంలో ప్రాంతీయాభిమానంతో పాటు కులాభిమానం కూడా ఎక్కువే. .

ఇక్కడ పోటీలో నిలిచిన వారిలో కాపులే ఎక్కువగా విజయం సాధిస్తూ వచ్చారు. అందుకే పవన్ కల్యాణ్ కూడా వ్యూహాత్మకంగా కాపు ఓటర్లను టార్గెట్ చేస్తూ పిఠాపురం సీటు ఎంచుకున్నాడు. అయితే పవన్ పై పైచేయి సాధిస్తామని వంగా గీత ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తనది అదే ప్రాంతం కావడం ఒక కారణమైతే, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా కావడం మరో కారణం, పైగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉంది. ఈ కారణలే తనను గెలిపిస్తాయని వంగా గీత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

ఇక పిఠాపురంలో వంగా గీత గెలుపు కోసం జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలోని కాపు నేతాలతో పిఠాపురంలో ప్రచారాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభంను వంగా గీత తరుపున ప్రచారం చేయించి కాపు ఓటర్లను వైసీపీ వైపు తిప్పుకునే ప్లాన్ లో ఉన్నారట. పైగా పవన్ ది నాన్ లోకల్ కావడంతో ప్రచారల్లో లోకల్, నాన్ లోకల్ నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ ను దెబ్బ తీయాలనే వ్యూహంలో జగన్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం ముఖ్య నేతలకు జగన్ దిశనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలతో పిఠాపురంలో పవన్ కు చెక్ పెడతారేమో చూడాలి.

Also Read:KTR:రైతులంటే ఎందుకంత చిన్నచూపు?

- Advertisement -