Jagan:పథకాలు ఆపగలరు..గెలుపును ఆపలేరు

15
- Advertisement -

ఢిల్లీ పెద్దలతో కలిసి ఇంటి వద్దకే పెన్షన్ రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్..మోసాలు, అబద్దాలతో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తుప్పుపట్టిన సైకిల్‌ను ఢిల్లీకి పంపి రిపేర్ చేయించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

2019 ఎన్నికల్లోనే ప్రజలంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ముక్కలు ముక్కలుగా విరగొట్టారన్నారు. ఆ తుప్పుపట్టిన సైకిల్‌ను రిపేర్ చేయించేందుకు ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇక దత్తపుత్రుడిని పిలిచి రిపేర్ చేయమంటే.. గ్లాసులో టీ తాగుతూ క్యారేజీ మీద మాత్రమే కూర్చుంటానని అంటున్నాడని ఎద్దేవా చేశారు జగన్.

పథకాలు ఆపగలరు.. తమ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు జగన్. జూన్ 4 తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన వారంలోనే బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

Also Read:Janasena:పవన్ కోసం కదిలిన చిరు

- Advertisement -