బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?

23
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్. మీడియాతో మాట్లాడిన జగన్.. చంద్రబాబు మోసం చేస్తాడని ఏపీ ప్రజలకు చెప్పానని.. కానీ ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ ను మించిపోయి చంద్రబాబు నటిస్తున్నాడని.. మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారన్నారు.

హామీలు అమలు చేయాలని అడిగితే.. సంపాదించే మార్గాలు ఉంటే చంద్రబాబు నా చెవిలో చెప్పాలని వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ తల్లులకు ఇచ్చిన అమ్మఒడి పోయే.. వసతి దీవెన పోయే.. మిగతా ఇస్తున్న పథకాలు అరకొరే అంటూ ఫైర్‌ అయ్యారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. రూ,1.40 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా ప్రజలకు మేలు చేయలేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని, ప్రజలు మోసపోయారని అన్నారు. ఇది అవినీతి ప్రభుత్వం అని తొమ్మిది నెలల్లో వేల కోట్లు అప్పులు చేసి, వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు.

Also Read:కులగణను రీ సర్వే చేయాలి: తలసాని

- Advertisement -