Jagan:పోలీస్ జులుం ఎల్లకాలం సాగదు

31
- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యారాజకీయాలపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల చేతుల్లోని ప్లకార్డులను లాక్కొని చింపేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎప్పటికి శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న పేపర్లను చించేసే అధికారం ఎవరిచ్చారంటూ నిలదీశారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమని అంతేగాని ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయడానికి కాదని హెచ్చరించారు.

రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలు నశించాలని గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. సేవ్‌ డెమొక్రసీ అంటూ నినదించారు. తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు జగన్.

Also Read:Elon Musk: ఏఐ ఫ్యాషన్ షో, మస్క్‌ ట్వీట్‌ వైరల్

- Advertisement -