రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నాడు అని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. మీడియాతో మాట్లాడిన జగన్… ఏపీ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదంటే హాట్ లైన్‌లో చంద్రబాబుతో టచ్‌లో ఉన్నాడు అన్నారు. రేవంత్, చంద్రబాబు, కాంగ్రెస్ హైకమాండ్ హాట్ లైన్‌లో టచ్‌లో ఉన్నారు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావు అన్నారు. ఇది వాస్తవం.. ఇదే జరగబోతోంది అన్నారు.
చంద్రబాబు జీవితానికి బహుశా ఇదే ఆఖరి ఎన్నిక కావొచ్చు… కనీసం కృష్ణా, రామా అనుకో.. పుణ్యం అయినా వస్తది.. ఈ మాదిరిగా చేస్తే నరకానికి పోతావ్ అని చురకలు అంటించారు. తప్పుడు పునాదులు వేస్తున్నారు.. రేపు వృక్షం అవుతుంది మీకు చుట్టుకుంటుంది అన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ నేతకు సమీప బంధువు… టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్‌రావుకు వరుసకు అల్లుడు అవుతారన్నారు.
పులివెందుల ఉప ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు… చంద్రబాబును మాబ్ స్టార్, ఫ్రాడ్ స్టార్ అంటారు అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. పోలింగ్ బూత్‌ల వెబ్ క్యాస్టింగ్‌ను వైసీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా..?, పోలింగ్ బూత్ ఆవరణల్లోని సీసీ ఫుటేజీని ఇచ్చే ధైర్యం మీకుందా..? చెప్పాలన్నారు. బందిపోటు దొంగలను మరిపించేలా చంద్రబాబు ప్రవర్తన ఉందని… నిన్న పులివెందులలో బందిపోట్లకు మించి చంద్రబాబు దౌర్జన్యంగా దొంగ ఓట్లు వేయించాడు అన్నారు.
Also Read:Nagarjuna Sagar:సాగర్‌కు పోటెత్తిన వరద
ఏపీలో ఓటు చోరీ అయితే రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడడు… వీళ్ళ పార్టీలు ఏంటో, వీళ్ళ ఎజెండాలు ఏంటో .. డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్కా వేసుకున్నట్టు ఎన్నికల్లో దౌర్జన్యాన్ని దగ్గరుండి చూసుకున్నాడు అన్నారు.

