జగన్ ప్లాన్స్..బాబుకు కలిసొస్తున్నాయా?

49
- Advertisement -

ఏపీ ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కూడా ఈసారి విజయంపై గట్టిగా ఫోకస్ పెట్టాయి. అటు వైఎస్ జగన్ 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంటే ఇటు చంద్రబాబు 160 స్థానాల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. ఇకపోతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను మార్చుతూ ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే వైసీపీలో జగన్ చేస్తున్న ఈ మార్పులే టీడీపీకి ప్లేస్ అవుతున్నాయా అంటే అవుననే సమాధానాలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి..

ఎందుకంటే వైసీపీలో మార్పుల కారణంగా కొంతమంది నేతలు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే వారంతా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తో టచ్ లోకి వెళ్ళినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా టీడీపీ గూటికి చేరారు. వీరిద్దరితో పాటు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన కోటంరెడ్డి శ్రేధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆల్రెడీ టీడీపీలో చేరిన సంగతి విధితమే. ఇక ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కూడా టీడీపీతో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఇలా వైసీపీలో పొసగని నేతలంతా టీడీపీ వైపు చూస్తుండడంతో మార్పు కోసం జగన్ చేస్తున్న ప్లాన్స్ చంద్రబాబుకు కలిసొస్తునాయని రాజకీయవాదులు అభిప్రాయ పడుతున్నారు. మరి ముందు రోజుల్లో ఇరు పార్టీల మద్య ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:ధరణిలో మార్పులా? రద్దా ?

- Advertisement -