YSRCP:కోటి సంతకాల సేకరణ

7
- Advertisement -

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘన విజయం సాధించింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే కోటి 4 లక్షల 11 వేల 136 మంది ప్రజలు తమ సంతకాలు చేసి, ప్రభుత్వ నిర్ణయంపై తమ వ్యతిరేకతను స్పష్టంగా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంతకాల పత్రాలను రాజ్‌భవన్‌కు తరలించే వాహనాలను వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలు లోక్ భవన్‌కు చేరుకోనున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని వైయస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారని తెలిపారు.

ఈ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారిపల్లెలో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో సంతకాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోందని వైయస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానించారు.

ఈ రోజు సాయంత్రం వైయస్ జగన్ గవర్నర్‌ను కలిసి, కోటి 4 లక్షల 11 వేల 136 మంది ప్రజల సంతకాలతో కూడిన పత్రాలను అందజేయనున్నారు. మెడికల్ విద్యను ప్రైవేటీకరించకుండా, ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని ఆయన గవర్నర్‌ను కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Also Read:దావోస్‌కు రేవంత్..కోర్టు పర్మిషన్

- Advertisement -