- Advertisement -
పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకుసాగుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. తాజాగా ప్రజలను నేరుగా కలిసేందుకు ప్రజా దర్బార్‌కు శ్రీకారం చుట్టనున్నారు. జూలై నుంచి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ప్రతిరోజు ఉదయం అరగంటపాటు సీఎం జగన్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే అవకాశమున్నందున దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇదే తరహాలో ప్రజా దర్భార్‌తో ప్రజలతో మమేకమైన సంగతి తెలిసిందే.
- Advertisement -