Jagan:జగన్ మేనిఫెస్టో రెడీ !

20
- Advertisement -

ఏపీలో రెండోసారి అధికారం కోసం వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికల్లో విజయం సాధించే దిశగా వైఎస్ జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల మార్పు చేపట్టి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచారు. ఇక ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 18న వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు ఎంపీ మోపిదేని వెంకటరమణ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు మేనిఫెస్టో రూపంలో కొన్ని హామీలు ప్రకటించి బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇక ఇప్పుడు వైసీపీ కూడా మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్దమవ్వడంతో జగన్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది..

గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయంలో ఆ పార్టీ మేనిఫెస్టోనే ముఖ్యపాత్ర పోషించింది. నవరత్నాల పేరుతో జగన్ ఇచ్చిన హామీలు బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. సంక్షేమమే ఎజెండాగా సాగిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దాంతో ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో ఈసారి కూడా మేనిఫెస్టోను వ్యూహాత్మకంగానే సిద్దం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈసారి సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా హైలెట్ చేస్తూ జగన్ మేనిఫెస్టో రెడీ చేసినట్లు వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో జగన్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే గత ఎన్నికల ముందు ప్రకటించిన హామీలలో సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, వంటి హామీలను జగన్ సర్కార్ అమలు చేయడంలో విఫలం అయింది. దాంతో ఈసారి జగన్ ఇచ్చే హామీలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది ప్రశ్నార్థకమే. ఏది ఏమైనప్పటికి టీడీపీ జనసేన పార్టీలు ప్రకటించిన హామీలకు ధీటుగా వైఎస్ జగన్ మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు సమాచారం. మరి వైసీపీ మేనిఫెస్టో ఈసారి ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.

Also Read:Sonia:సోనియాకు ‘ఓటమి’ భయం!

- Advertisement -