మళ్ళీ విశాఖ..జగన్ ధీమా ఆదేనా?

18
- Advertisement -

విశాఖను రాజధానిగా ప్రకటించాలని ఏపీలో అధికార వైసీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. కానీ ఆ విషయంలో ప్రభుత్వానికి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. రాజధాని అంశం కోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖాకు తలరించాలని జగన్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. స్వయంగా సి‌ఎం జగన్మోహన్ రెడ్డి పలుమార్లు విశాఖనే రాజధాని అని ప్రకటించినప్పటికి ఆ దిశగా ముందడుగు పడలేదు. గత ఏడాది డిసెంబర్ లోనే తను విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. కానీ జరగలేదు. ఇక తాజాగా విశాఖ విషయంలో మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గెలిచి విశాఖ రాజధాని కేంద్రంగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు..

దీంతో మరోసారి రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అమరావతిపై తనకు ఎలాంటి కోపం లేదని చెబుతూ.. విశాఖలో అన్నీ మౌలిక వసతులు ఉన్నాయని, అందుకే అక్కడికి రాజధాని తరలించేందుకు సిద్దమైనట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే వైసీపీ గెలిస్తేనే విశాఖ రాజధాని అవుతుందని సి‌ఎం జగన్ చెబుతుండడంతో మరి ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందా ? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం సందిగ్ధంలోనే ఉంది. ప్రస్తుతం గెలుపు విషయంలో జగన్ అండ్ కో కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికి ప్రజాక్షేత్రంలో కొంత భిన్నాభిప్రాయాలే వ్యక్తమౌతున్నాయి. మరోవైపు టీడీపీ జనసేన కూటమి తాము గెలిస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు విశాఖ వైపు మొగ్గు చూపుతారా లేదా అమరావతి వైపే మద్దతు పలుకుతారా ? అనేది ఆసక్తికరంగా మారిన అంశం. మరి గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంటూ వస్తున్న రాజధాని అంశానికి ఎన్నికల తరువాతనైన పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.

Also Read:జగన్‌కు షాక్…మంత్రి రాజీనామా

- Advertisement -