ఎన్నికలు తీరుపై జగన్ అనుమానం..!

22
- Advertisement -

ఏపీలో ఎన్నికలు జరుగుతున్న తీరుపై అనుమానం వ్యక్తం చేశారు సీఎం జనగ్. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందని..అధికారుల బదిలీపై సంచలన కామెంట్స్ చేశారు. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారని, కుట్రలు పన్నుతున్నారని ,పేదలకు మంచి చేస్తున్న జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

తనను ఉండకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పారు ఈ నెల 11న సాయంత్రం 5గంటలకు ఏపీలో ప్రచార పర్వం ముగుస్తుంది.

ఏపీలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను ఈసీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read:గురువు రమణయ్య ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్..

- Advertisement -