నవంబర్ 29 మనందరికీ ఎంతో ముఖ్యమైన రోజు….కేసీఆర్ దీక్షతో యావత్ తెలంగాణ బెబ్బులిలా లేచి కూర్చుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి… సబండ వర్గాలు కదిలాయి…చంద్రబాబు చేయని కుట్రలు లేవు.. కేసీఆర్ గారిని నిలువరించాలని, ఆపాలని చంద్రబాబు కుట్ర చేసాడు…చివరకు కాంగ్రెస్ mla లను కూడా చీల్చాలని ప్రయత్నం చేశాడన్నారు.
కానీ ఎన్నికలను ఆయుధంగా మల్చుకొని కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపారు..ఆ పద్దతుల్లోలోనే తెలంగాణ సాధించారు కేసీఆర్…నా స్వప్నం ,నా ద్యేయం తెలంగాణ అని నినదించారు కేసీఆర్.. వెనకకు పోతే రాళ్లతో కొట్టండి అని ప్రకటించిన ధిరోదత్తుడు కేసీఆర్…కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు…. తెలంగాణ సాధించిన తర్వాత కూడా చంద్రబాబు ఎత్తులు వేశారు… కేసీఆర్ తిప్పికొట్టి తరిమేశారు…తెలంగాణ సాధన అనేది ఆషామాషీ కాదు అన్నారు.
సమైక్యాంధ్ర నాయకులు , కార్పొరేట్ శక్తులు,ఆంధ్ర మీడియా ఎన్నో ఎత్తులు వేసారు..ఆనాడు రోశయ్య,చంద్రబాబు ఒక్కటయ్యారు….ఆనాడు కాంగ్రెస్, tdp ,బీజేపీ నాయకులు ఒక్కడు కూడా కేసీఆర్ గారికి సపోర్ట్ చేయలేదు.. అందరూ పదవుల కోసం పెదవులు ముసుకున్నారు.. ఆంధ్ర లాబీయింగ్ లో వాళ్లంతా బెండ్ అయ్యారు….మానవత్వం లేని ప్రభుత్వం ఆనాడు ఉంది… జాతికి నాయకుడు అవసరం.. నాయకుడు లేని జాతి కనుమరుగు అవుతుంది… యావత్ తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారే నాయకుడు.. ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ కు శ్రీరామరక్ష….ఇవ్వాళ మళ్ళీ మనం పోరాట పటిమతో పోరాటం చేయాలి… నేటి యువతకు కేసీఆర్ గారి పోరాటాన్ని, అంకుటిత దీక్షను విడమరిచి చెప్పాలి.. BRS నేపద్యన్నీ చెప్పాలి… యువతను జాగృతం చేయాలన్నారు.
Also Read:బీఆర్ఎస్‌కు పురిటిగడ్డ కరీంనగర్: కేటీఆర్