- Advertisement -
రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితిలో ఉన్నారన్నారు.నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందన్నారు.
ఎండిపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మిరప రైతులకు రూ.80 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని..గత కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చాం అన్నారు.కక్ష పూరితంగా ప్రాజెక్టుల నుండి రైతులకు నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వదలేదన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి, మిరప తోటలను రైతులతో కలిసి పరిశీలించారు జగదీష్ రెడ్డి.
Also Read:ప్రజల గుండెల్లో కేసీఆర్:ఆర్‌ఎస్పీ
- Advertisement -