కోమటిరెడ్డి ఉండాల్సింది జైలులో!

10
- Advertisement -

ఒక భాద్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం చేయడం నేరం.. నమ్మించే పని చేసిన వెంకట్ రెడ్డి నేరస్తుడే అని మండిపడ్డారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉండాల్సింది జైలులో..మంత్రివర్గంలో కాదు అని విమర్శించారు.

మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలను నమ్మేలా మాట్లాడటం నేరం అని కోమటిరెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నల్లగొండ జిల్లా రైతాంగానికి నీళ్లు ఇచ్చే సోయి లేదు…వాళ్ళ దందాలు వేరు, కమీషన్లు వేరు అన్నారు. నీళ్ళన్నీ సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. కనీసం ఇప్పటికైనా మోటార్లు ఆన్ చేసి నల్గొండ రైతులకు నీళ్ళు ఇవ్వాలి అన్నారు.

బోసిపోయి కనిపిస్తున్న ఉదయ సముద్రం, ఒకవైపు కృష్ణ నదిలో సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీ ల నీళ్ళు ,మరొక వైపు నల్గొండ జిల్లా లో ఎండిపోతున్న పొలాల పక్కన రైతు ధర్నాలు , ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ,సాగునీటి రంగంపై ఉన్న సోయికి, నల్గొండ జిల్లా మంత్రుల కు పని తీరుకు నిదర్శనంకోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నల్లగొండ జిల్లా రైతాంగానికి నీళ్లు ఇచ్చే సోయి లేదు అన్నారు. వాళ్ళ దందాలు వేరు, కమీషన్లు వేరు..నీళ్ళన్నీ సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. కనీసం ఇప్పటికైనా మోటార్లు ఆన్ చేసి నల్గొండ రైతులకు నీళ్ళు ఇవ్వాలి అన్నారు.

Also Read:అనిశెట్టి రజిత మృతి…కేసీఆర్ సంతాపం

- Advertisement -