రియల్ ఎస్టేట్ దందా కోసమే రేవంత్ ఆరాటం!

11
- Advertisement -

రేవంత్ రెడ్డి పథకం ప్రకారం L&T సంస్థపై ఒత్తిడి తెచ్చి వాళ్లను వెళ్లగొట్టి, వేల కోట్లు దండుకొని 15 వేల కోట్లు ప్రజలపై భారం మోపిండు అని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి..మెట్రోకు ఉన్న రూ. 35 వేల కోట్ల విలువ గల 300 ఎకరాల ఆస్తులను కూడబెట్టారన్నారు.

అదానీ, మేఘా కృష్ణారెడ్డిలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు అన్నారు. జనమే లేని చోట, ఇండ్లు లేని చోట, జనావాసాలు లేని ఫ్యూచర్ సిటీకి రోడ్లు, మెట్రో వేస్తాడంట రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.

ఈయన ఫ్యూచర్ ఏందో ఈయనకే తెల్వదు..ఇంక ఫ్యూచర్ సిటీ ఎక్కడిది?, కట్టని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే అంట,మళ్లీ దాని పక్కన రైలు అంట!,ఇదంతా కేవలం రియ‌ల్ ఎస్టేట్ దందా కోసమే.. తాను, తన కుటుంబం, బంధుమిత్రులు కొన్న భూముల రేట్లు పెంచుకోవడానికే తప్ప ఎక్కడా కూడా ప్రజల అవసరం లేదు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యం..రేవంత్ రెడ్డి బీసీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు..రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు సాధ్యమని రేవంత్ ఢిల్లీలో ప్రగల్భాలు పలికాడు అన్నారు జగదీష్ రెడ్డి.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు..పూర్తి వివరాలు

- Advertisement -