Jagadish:కుట్రలు కుతంత్రాలతో కాలయాపన

17
- Advertisement -

పాలన కంటే కుడా కుట్రలు కుతంత్రాలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.బి ఆర్ యస్ పార్టీ పిలుపు మేరకు సూర్యాపేటలో శనివారం ఉదయం జరిగిన రైతుదీక్ష లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ కాళేశ్వరం పై చిల్లర ప్రేలాపనలు చేయడమే ఇందుకు అద్దం పడుతుందని ఆయన విరుచుకుపడ్డారు. పంట నష్టం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఏ ఒక్కరూ ఎందుకు పెదవి విప్పడం లేదని ఆయన నిలదీశారు. జరుగుతున్న ఘోర కలి ని చూసి ఆత్మస్థైర్యం దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకే మండు టెండలను ఖాతరు చెయ్యకుండా బి ఆర్ యస్ అధినేత కేసీఆర్ పోలం బాట పెట్టారన్నారు.ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా అధికార పార్టీ యంత్రాంగం మొత్తం క్రికెట్ మోజులో నిమగ్నమయ్యారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ ద్రోహం తోటే తెలంగాణా లో పంటలు నాశనం అయ్యాయని ఆయన ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లానుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు గజ దొంగల్లా దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కాంట్రాక్టర్లను,రైస్ మిల్లర్లను బెదిరించి మరీ వసూళ్లకు పాల్పదడమే ఇందుకు నిదర్శనమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ బాస్ ల చుట్టూ తిరగడమే సరి పోతుందన్నారు.ఇక్కడ వసూలు చేసిన దోపిడీ సొత్తును ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారన్నారు.ఎన్నికల హామిలో భాగంగ ఇచ్చిన ఋణమాఫీ, 500 బోనస్ లు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ నడ్డు పెట్టుకొని రుణమాఫీ,500 బోనస్ లను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన ప్రేమ ఉండి ఉంటే ఎన్నికల సంఘం అనుమతితో ఋణమాఫీ,500 బోనస్ లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసే టట్లు అయితే అందుకు మద్దతుగా బి ఆర్ యస్ పార్టీ లేఖ రాస్తుందన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -