మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రగతిభవన్‌లో రెండోరోజు సిరిసిల్ల ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు కేటీఆర్. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్,కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ,ప్రభుత్వ సలహాదారు వివేక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి…ఆస్తి మాత్రమే వారసత్వంగా వస్తుందని నాయకత్వం అనేది తెలివితేటలు,సామర్థ్యంతో వస్తాయన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో నేడు బంగారు తెలంగాణ పునర్‌నిర్మాణంలో కేటీఆర్ భాగస్వామ్యం చాలా కీలకమైందన్నారు. కేటీఆర్ లాంటి నాయకుడు సిరిసిల్ల ప్రచారానికే పరిమితం కాకుడదని…ఆయన సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమన్నారు.ఒకప్పుడు ఐటీ,పరిశ్రమలంటే గుజరాత్,మధ్యప్రదేశ్ గుర్తొచ్చేవని…కేటీఆర్ వచ్చాక తెలంగాణ పారిశ్రామిక రంగంలో దూసుకుపోతుందన్నారు.
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటలకు బీటలు వారుతున్నాయన్నారు. రాష్ట్రం మొత్తం అసూయపడేలా సిరిసిల్ల డెవలప్ అవుతోందన్నారు మంత్రి కేటీఆర్. రూ.200 కోట్ల అంచనాతో పాత సిరిసిల్లను డెవలప్ చేస్తున్నామన్నారు. మూడేళ్లలో సిరిసిల్లకు రైలొస్తుందని.. తంగెళ్లపల్లి దగ్గర రైలు స్టేషన్ వస్తుందన్నారు.