ఇప్పటివరకు సస్పెండ్ పై బులెటిన్ ఇవ్వలేదు అని..రావొద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బులెటిన్ ఇస్తే నేను రాను… ఏ కారణం తో నన్ను సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. వారం నుంచి తనకు బులెటిన్ విడుదల చేయలేదు… ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తుంది అన్నారు.
పద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదు.. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుంది అన్నారు. సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు.. మందబలం తో సభ నడుపుతాం అంటే కుదురదు అన్నారు. ఇప్పుడు బులిటెన్ ఇస్తారో చూస్తా…లేదంటే స్పీకర్ ను కలుస్తాను… స్పీకర్ ను మళ్ళీ అడుగుతున్న బులిటెన్ ఇవ్వాలి అన్నారు.
వారం రోజుల నుండి రోజు అడుగుతున్న.. కోర్టుకు పోతాం అనే భయం తోనే నాకు బిలిటెన్ ఇవ్వడం లేదు, సస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.వారం గడిసిన ఎందుకు ఇవ్వడం లేదు.ఆధారాలు లేకనే సస్పెన్షన్ బులిటెన్ ఇవ్వడం లేదు చెప్పాలన్నారు.
ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారు..ప్రజల సమస్యలు శాసన సభలో లేవనెత్తిన ప్రశ్నలు లకు జవాబు లేదు అన్నారు. నెల రోజులకు నిన్న డబ్బులు మంజూరు చేశారు.. పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి నేను రాత్రి 10.15 నిమిషాలకు జరిగితే 10.35కు ఇక్కడ స్టార్ట్ అయ్యి నేనే ముందు చేరుకున్న అన్నారు.
ప్రతి మార్గం నుండి వెళ్ళే ప్రయత్నం చేశా… ప్రతి శవం దగ్గరకు నేనే వెళ్ళాను.సహాయక చర్యల్లో పాల్గొన్నాను అన్నారు. చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వారికి ఉద్యోగాలు కూడా కల్పించాం… వీళ్ళ దుర్మార్గపు చర్యల వలన చనిపోయిన కుటుంబాలు ఎంత ఇబ్బందులు పడుతున్నాయి.. వారిని బయటకు తెచ్చే వరకు అక్కడే ఉంటాం అన్నారు.
Also Read:ముంబైపై చెన్నై…రాజస్థాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ గెలుపు