హైకోర్టు తీర్పు..రేవంత్‌కు చెంపపెట్టు!

14
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పి.సి.ఘోష్ కమీషన్ నివేదికపై హైకోర్టు తీర్పుతో మా వాదన నిజం అయింది అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. ఎన్ని విచారణలు చేసుకున్నా కేసీఆర్ మల్లెపువ్వు అని అర్ధం అయింది…పి.సి.ఘోష్ కమీషన్ కాదు ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష అని బీఆర్ఎస్ ముందే చెప్పింది అన్నారు.

కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను ఘోష్ రిపోర్టు రూపంలో ఇచ్చారు..కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ఇష్టం లేని ఏపీ పెద్దల కుట్ర ఉంది..కాళేశ్వరం కూలిపోలేదు,కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు..కేసీఆర్ పై చేసిన ఆరోపణలు తప్పు అని హైకోర్టు తీర్పుతో నిరూపితం అయింది..కమీషన్లు,విచారణలు చేసుకోవచ్చని మేము చెప్పాము అన్నారు.

కరెంటు,కాళేశ్వరం కమీషన్లతో ఏం కాదు… రాష్ట్రంలో సీఎం కుటుంబ సభ్యులు,మంత్రుల కమీషన్ల దందా నడుస్తోంది…కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటే బిఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుతో కొట్టాలి…కాళేశ్వరం పేరుతో ఆంధ్రా బాసులకు నీళ్లు వదిలారు…బనకచర్లకు రూట్ క్లియర్ చేయడం కోసం గోదావరి నీళ్లను కిందకు వదిలారు..కేసీఆర్ జగిత్యాకు వస్తే సీఎం భయపడ్డారు..సీఎం పోటీ సభలో బూతు పురాణం నడిచింది..బిఆర్ఎస్ కు ఇప్పుడు అవకాశం ఇచ్చినా కన్నెపల్లి పంప్ హౌస్ లు ఆన్ చేస్తాము..కాళేశ్వరం అవసరం తెలిసి కేసీఆర్ నిర్మించారు అన్నారు.

పిల్లర్లు కుంగాయి అనే సాకుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గం బట్టబయలు అయింది..కేసీఆర్ ఇంజనీర్ గానే మాట్లాడారు..కాళేశ్వరం నా సష్టి అని కెసిఆర్ చెప్పారు..మూడు ఏళ్లలోనే కాళేశ్వరంను పూర్తి చేసి చూపెట్టారు…రాష్ట్రంలో త్రాగునీటి ఎద్దడి మొదలు అయింది…సీఎం చెత్త మాటలు మాట్లాడారు.ఇప్పటి కైనా కాళేశ్వరం పంపులను ఆన్ చేయాలి…రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖులు భూమి కనపడగానే రియల్ ఎస్టేట్ దందా చేస్తారు…కేసీఆర్ ను బద్నాం చేయాలన్న రేవంత్ రెడ్డి నిర్వాకం బయటపడింది…తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి…మేము సంబురాలు చేసుకోవడం లేదు…బండి సంజయ్,రేవంత్ రెడ్డి వేరు కాదు అన్నారు.

Also Read:పెన్షన్ బెనిఫిట్స్..హైకోర్టు సిరీయస్!

రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను బండి సంజయ్ చదువుతారు..ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే విధంగా ప్రభుత్వం కుట్ర చేసింది…ఆర్టీసీని సంక్షోభంలో నెట్టాలని ప్రభుత్వం చూస్తోంది..రోజువారీ కూలీల కంటే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది..విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను రేవంత్ రెడ్డి పరిష్కరించాలి అన్నారు.

- Advertisement -