కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు నల్గొండలో బీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు.
ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతు మహాధర్నా చేపట్టి తీరుతాం అని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలన చేతకాక, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల నిరసనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పని చేయటం పార్టీల హక్కు అని తెలిపారు. పోలీసుల తీరును తప్పు పడుతూ కోర్టుకు వెళ్లైనా ధర్నా చేపడుతామని స్పష్టం చేశారు.
కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు పుడుతుందని ప్రశ్నించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కండ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతులు పంట చేలకు నిప్పు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత అడ్డుకున్నా రేపటి దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read:పింక్ బుక్‌లో రాస్తున్నాం…పోలీసులు జాగ్రత్త!