మంత్రి జగదీష్ రెడ్డి విరిగిన మూసి ప్రాజెక్ట్ గేట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులుతో సమీక్ష సమావేశం నిర్వహించార. ఈ సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్, ఈఎన్‌సీ మురళీధర్,ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్ధి లింగయ్య, భూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తొలగిన తలుపు 48 గంటల్లో అమర్చి.. ఈ నెల 9 నాటికి డ్యామ్ మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. మూసి ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందవద్దు. కుడి ఎడమ కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందిస్తామని మంత్రి తెలిపారు.
48 గంటల్లో విరిగిన గేట్ స్థానంలో కొత్త గేట్ ను అమర్చి నీటి వృధాను నిలువరిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో స్మిత సబర్వాల్ ఈఎన్‌సీ ఉన్నత అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు మూసి ప్రాజెక్ట్‌ను సందర్శించారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.