ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ వ్యవహారంపై యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ప్రమాణం చేసేందుకు సిద్దమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రమాణం చేసేందుకు బండి సంజయ్ యాదగిరి గుట్టకు వెళ్లారు. దీనిపై టీఆర్ ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.
బండి సంజయ్‌ని ఎవరు ప్రమాణం చేయమని అడిగారని ప్రశ్నించారు. అమిత్ షాతో ప్రమాణం చేయిస్తాడా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే బీజేపీవాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారుని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మునుగోడు గడ్డమీద అమిత్‌షా చెప్పిన మాటలను నిజంచేసే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యారని కౌంటర్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాను కట్టడి చేద్దాం:మోదీ
ఇదేం పిచ్చి.. బైక్ పై ప్రీ వెడ్డింగ్ షూట్
పీఎస్-1…ఓటీటీ డేట్ ఫిక్స్